భారత దేశము నా మాతృ భూమి..భారతీయులందరూ నా సహోదరులు..నేను నా దేశమును ప్రేమించు చున్నాను..చిన్నపుడు చేశా ఈ ప్రతిజ్ఞ .కాని ఇపుడు నాకు అన్ని సందేహాలే...
ఎం ప్రేమించాలి..ఎవరిని ప్రేమించాలి?? తరతరాలకి తరగని ఆస్తి ని కూడబెట్టుకున్న మన రాజకీయనయకులనా??వాళ్ళు చేసే కుంభ కోణాలనా?? అడుగడుగునా పేరుకున్న మన మత, కుల వర్గ వ్యవస్థనా?? .. తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరిగే నా మూర్ఖపు సహోదరులనా?? అణగారిన అట్టడుగు వర్గాల ఆకలినా?? దేశం ఎలా ఉంటె మనకెందుకులే అని అమెరిక చేక్కేసే మన అన్నలు/అక్కలనా?? ఎవరిని..ఎందుకు ప్రేమించాలి??
దేశం అంటే మట్టి కాదోయి దేశం అంటే మనుషులోయ్..అవును.. ఈ నా భారత దేశం లో..ఇంక్కోన్నాలు పోతే మట్టి కనిపించదు.అంతా మనుషులే నిండిపోతారు. ఆ రేటు లో పెరిగిపోతోంది మన జనాభా.
తప్ప తాగి రోడ్డు మీద జనాలని చంపే వాళ్ళు మనకి ఆరాధ్య దైవాలు.. దేశద్రోహులకి సహకరించే నా సహోదరునికి 'beta tum logonko jeena sikhaya" అని పొగడ్తలు..
తప్పు చేసాం అని తెలిసి తప్పిచుకోవాలను కునే వాళ్ళకి ఎం చెప్పాలి.??
Thursday, November 5, 2009
Subscribe to:
Posts (Atom)