Saturday, September 20, 2008

వేషగాళ్ళు..

రాక్షసులు ప్రతిసారి ఓడిపోయి... దేవుడుని వేడుకున్నారు.. "దేవా , మేము ప్రతిసారి మీ చేతుల్లో ఒడి పోతున్నాము. మీరు ఏదో ఒక అవతారం ఎత్తి మా ఆగడాలను అణచి చేస్తున్నారు.. మేము బ్రతికేదెలా.. మీరంటే మాకు ద్వేషం లేదు.. కానీ మా బుద్ది ఇతరులని వేధించడం ,ఏదో విధంగా నాయకత్వాన్ని పొందటం.. , విలాసవంతమైన జీవితం, ఎవ్వరిని పట్టించుకోకుండా తోచిందే చేయటం..ఇలా ఎన్నెన్నో.. ఇందులో మాతప్పేమి లేదు.. ఇది మా బుద్ది.. మా చిత్తం వచ్చినట్టు నడుచుకోటానికి మాకొకలోకం చూపించండి.. ఇక మేము స్వర్గలోక వాసులని ఎడిపించం.. అనివేడుకున్నారు..దానికి దేవుడు.. "అటులనే, మీరు భూలోకాన్ని ఎలుకోండి.. కానీ వేషాలతో కాదు సుమా .. తెల్లనిఖద్దరు ధరించండి..మొహానికి నవ్వు పులమండి .. గుంపు లో ఉంటె అలాగే వేషం మార్చండి... మానవులు అల్పులుఅందున ప్రజా స్వామ్య దేశాల్లోని మనుషులు మిమ్మల్నేమీ చేయలేరు.. వాళ్ళలో కలిసిపోయినట్టు నటించండి.. మీరే నాయకులవతారు.. ఒక్కసారి అధికారం దక్కిందా ఇక మీఇష్టం.. మళ్లీ ఎన్నికలదాక .. పొండి .. మళ్లీ చాయలకి రాకండి.. అని దేవుడనగానేచెంగున భూలోకంలో ఉద్భవించారు..తెల్లని ఖద్దరు దుస్తుల్లో..మన రాజకీయనాయకులు... ..

1 comment: