ఏ మేరా ఇండియా..
నిన్న ఏదో పని ఉండి కొంచం జోరుగా X రోడ్స్ వైపు వెళ్తున్నాను. ఇంతలో ఒక పార్టీ రాలి నాకు అడ్డంగావచ్చింది..జోరుగా వస్తున్నారు బైక్స్ ఫై పార్టి కార్య కర్తలు.. తమేదే ఆ రోడ్డు రాజ్యమ ఐనట్టు.
మనసు హుషారుగా ఉండటం తో నేను కూడా జోరుగా వస్తున్నాను. ఆ క్ష్ రోడ్డు లో నేను క్రాస్ చేద్దాం అనుకునే సరికిపార్టి ఆటో జోరుగా వస్తోంది,, నేను బ్రేఅక్ వేసా,, కాని ఆటో కూర్చున్న కార్యకర్త "ఓయ్ " అంటూ నా వైపు కోపంగాచూసాడు. రోడ్డు మాది అన్నట్టు.. తామేదో vipలం అన్నట్టు..
హహహ...నాకు నవ్వొచ్చింది మల్లి మన ఇండియా ని చూసి..
ఒక్కడి మొహం చదువుకున్నట్టు లేదు.. తాగి తాగి వచ్చిన మొహాలు, బొజ్జలు..
మొహం లో కనపదుతొనె ఉంది ఏదో బలుపు..తామేదో గొప్ప అన్న భావన..ఎదుటివాడి మీద అధికారంచేలాయించాలన్న తపన..
హహహ.. ఎవడు పార్టీ పెడితే వాడి పంచన చేరే వీళ్ళు.. పెద్దగా చదువు సంధ్యా లేని వీళ్ళు.. చూడగానే రౌడిలలాకనిపించే వీళ్ళు ... రేపటి మన పాలకులు..
ఏ మేరా ఇండియా...హహహ
Sunday, March 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment