
ఏ మేరా ఇండియా...
ఆదివారం ..ఉదయం 8 గం!! దాటింది.. నేనింకా మగతలోనే ఉన్నా.కాని ఆ మగతలో ఏవేవో అరుపులువినిపిస్తున్నాయి.. అటు ఇటు పక్క మీద దొర్లా.. మెలకువ ఎక్కువైనా కొద్ది అరుపుల శబ్దం ఎక్కువైంది..
నేనేమి software ..bpo ఉద్యోగున్ని కాకpoyinaa ఆదివారం అనగానే ఎక్కడలేని బద్ధకం.
ఎంటా అని లేచి చూసా ..మన క్రిస్టియన్ సోదరుల మహాసభ జరుగుతోంది..దాని తాలూకు పాటలు, వీరావేశంగాఅరుపులు.. ..మా ఇంటిపక్కన చెర్చ్ లేకపోఇనా ఆఫ్ సీజన్ కారణంగా పక్కనే ఉన్న ఫుంక్షన్ హాల్ అద్దెకి తీసుకొన్నారుమహా సభలకి..ఉదయం 8 గంటలకి మొదలు..సాయంత్రం 5 దాకా..
గత కొన్ని వారాలుగా ఇదే తంతు.. ఆ ఆవేశ పూరితమైన అరుపులకి నా బుర్ర వేడెక్కటం ప్రారంభం ఐంది..
ఎందుకీ మతం మైకుల్లో అరుపులు ఎవరి కోసం. ఎంత మత ప్రచార హక్కు ఉంటె మాత్రం ఇన్ని మహా సభలుఅవసరమా ...
ఇది కేవలమ్ క్రిస్టియన్ సోదరులకే వర్తిస్తుందా...కాదు కాదు అందరికీ..
శుక్రవారం ఐనదంటే చాలు మన ముస్లిం సోదరులు tapu లేపుతారు ..ఆదివారం క్రిస్టియన్ సోదరుల వంతు . ఇకహిందువుల సంగతి చెప్పనే అక్కర లేదు దానికి ప్రతి రోజు ఏదో ఒక సమయం సందర్భం ఉందనే ఉంటుంది. వినాయకచవితి ,, దసరా .. పెళ్ళిళ్ళు.. ఆయప్ప పూజలు.. బోనాలు ..
ఎప్పుడు మనకి మత మౌడ్యం విడేది. ఎప్పుడు మనం మనుషుల్లా ప్రవర్తించేది. ఎప్పుడు. ఎప్పుడు..
సరే మతం అవసరమే..ఏదో ఒక శక్తి ఉంది అది మనని కాపాడుతుంది అని నమ్మి దానికోసం ఏదో విధంగా ఒక ritual చేసుకోటం అవశాకమే ఉండొచ్చు.. దానికి కాని మైకుల్లో అరుపులేందుకు..?
మతం..దేవుడు ఈ మనసుల్లోంచి పోయేదేప్పుడో ... నాకు ఈ జన్మ నుండి విముక్తి ఎప్పుడో..
దేవుళ్ళకు కొంచెం చెముడు లెండి. ఆమాత్రం గోలచెయ్యకపోతే వినపడదు ఏంచేద్ధాం!
ReplyDelete